నితిన్ గడ్క‌రీతో కేశినేని నాని, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి భేటీ

  • ఢిల్లీలో స‌మావేశ‌మైన నేత‌లు
  • జాతీయ ర‌హ‌దారుల విస్తర‌ణ‌కు సంబంధించిన అంశాల‌పై చ‌ర్చ‌లు
  • భేటీకి జీఎంఆర్ సంస్థ‌కు కూడా ఆహ్వానం
జాతీయ ర‌హ‌దారుల విస్తర‌ణ‌కు సంబంధించిన అంశాల‌పై మాట్లాడేందుకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో విజయవాడ ఎంపీ కేశినేని నాని, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఢిల్లీలో స‌మావేశ‌మ‌య్యారు. ముఖ్యంగా హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి ఆరు లేన్ల ర‌హ‌దారి విస్తరణపై వారు చ‌ర్చించారు. దాన్ని ఎక్స్‌ప్రెస్‌ హైవేగా మార్చాలన్న విష‌యంపై చ‌ర్చ‌లు జ‌రిపారు.

జాతీయ రహదారి విస్తరణపై ఇప్పటికే ఇద్ద‌రు ఎంపీలు గడ్క‌రీకి ప‌లుసార్లు లేఖ‌లు రాశారు. గుత్తేదారు నుంచి సమస్యలు ఉన్న విష‌యంపై వారు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. కాగా, ఈ స‌మావేశానికి జీఎంఆర్ ప్రతినిధులను కూడా కేంద్ర రోడ్డు, ర‌వాణా మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది.

Kesineni Nani
Telugudesam
Komatireddy Venkat Reddy
Congress

More Telugu News